వీణవంక: పోతిరెడ్డిపల్లి గ్రామంలో పోలీసుల కార్డెన్ సర్చ్ 25 ఇసుక ట్రాక్టర్లు సరైన పత్రాలు లేని 18 టూవీలర్స్ సీజ్ చేసిన పోలీస్ లు
వీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 25 ఇసుక ట్రాక్టర్లు అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు18 లేని టూ వీలర్స్ 4గూడ్స్ వాహనాలను పట్టుకొని సీజ్ చేసినట్లు హుజురాబాద్ ఏసిపి మాధవి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా యువకులు సరైన పద్ధతిలో నడుచుకోవాలని మద్యం మాదకద్రవ్యాల కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ ఆవుల తిరుపతి తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.