సంగారెడ్డి: వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పీఎం పిలుపుమేరకు కౌడిపల్లి లో ఘనంగా గేయ ఆలాపన
వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల పాఠశాలలో శుక్రవారం వందేమాతర గేయంను ఆలపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై మురళి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ 7 11 1875 నాడు బక్కిం చంద్ర చట్ట ఉపాధ్యాయ సంస్కృతంలో రచించి నేటికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గేయాలపన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.