గుంటూరు: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
Guntur, Guntur | Sep 23, 2025 భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పలువురు అధికారులతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాలైన ప్రగతి నగర్, బాలాజీ నగర్, రామిరెడ్డి తోట పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీరు ఏవిధంగా వస్తున్నాయో అడిగి పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.