కనిగిరి: రక్తదానంతో ఆపదలో ఉన్న సాటి మనిషికి ప్రాణదానం చేయవచ్చు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: రక్తదానం ఒక గొప్ప కార్యక్రమం అని, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న సాటి మనిషి ప్రాణాలను కాపాడవచ్చు అని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతను ఎమ్మెల్యే అభినందించారు. రక్తదానంపై ఉన్న అపోహలను విడనాడి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బిజెపి, టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.