క్రీడలు ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయి: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్
Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో ఆధునిక సౌకర్యాలతో క్రికెట్ పిచ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ క్రికెట్ పిచ్‌ను సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ఎస్పీ స్వయంగా క్రికెట్ ఆడి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడంతో పాటు, పరస్పర సహకార భావనను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ విధులు క్లిష్ట స్వభావం కలిగినవిగా ఉండి, అనేక సందర్భాల్లో ఒత్తిడిమయ పరిస్థితుల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు