డోన్: గాజులదిన్నె నీరు దారి మళ్లింపు పై చర్యలు: డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Apr 19, 2026 గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి డోన్కు సరఫరా అవుతున్న తాగునీటి పైపులైన్లను ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు. కొంతమంది అక్రమంగా కనెక్షన్లు తీసుకుని తాగునీటిని తమ వ్యవసాయ పొలాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు సమృద్ధిగా అందించడం ప్రభుత్వం లక్ష్యమన్నారు