ఒంగోలు అర్బన్: అటవీ భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలను అందజేయాలనే ఆదేశించిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 4, 2026
ప్రకాశం జిల్లాలోనున్న అటవీ భూములను గుర్తించి సమగ్రంగా నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ వినోద్ కుమార్ తో కలసి, సంబంధిత రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ రికార్డులలో అడవులుగా నమోదు చేయబడిన భూములు, గెజిట్ నోటిఫికేషన్లు, బ్లాక్ మ్యాప్‌లు, అటవీ బ్లాక్‌ల తదితర వివరాలు నమోదు చేయాలన్నారు