జిల్లాలో మద్యం రహిత ఎన్నికలే ఎక్సైజ్ శాఖ లక్ష్యం: కోడూరులో సెబ్ అధికారి ఖాజా మొహిద్దీన్
జిల్లాలో మద్యం రహిత ఎన్నికలే ఎక్సైజ్ శాఖ లక్ష్యమని సెబ్ అధికారి ఖాజా మొహిద్దీన్ అన్నారు. పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సెబ్ అధికారులు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ మద్యంపై, ముఖ్యంగా తెలంగాణ మద్యం, నాటు సారా తయారీ మొదలైన అంశాలపై దృష్టి సారించినట్లు సెబ్ అధికారి ఖాజా మొహిద్దిన్ చెప్పారు.