సిర్పూర్ టి: దాహేగం మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, భయాందోళనలో ప్రజలు
దహేగం మండలంలోని బిబ్రా, దేవాజ్ గూడెం, జెండా గూడ చివర్లో పెద్దపులి పాద ముద్రలను స్థానికులు గుర్తించారు. దీంతో పెద్దవాగు పరిసర ప్రాంతాలలో పులి సంచరించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగజ్నగర్ డివిజన్లోని పలు మండలాలలో పెద్దపులి కదలికలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పెద్దపులి మళ్లీ సంచరించడంతో ఎటు వెళ్లాలన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు,