బనగానపల్లె: బనగానపల్లెలో శుక్రవారం పర్యటించనున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు బనగానపల్లె పంచాయతీరాజ్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం బనగానపల్లెలోని ఈద్గా నగర్ ప్రాంతంలో చైతన్య స్కూల్ వద్ద నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా - సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు