ఉరవకొండ: రేపు గడేకల్ కు వైద్యాధికారుల బృందం వస్తున్నారని దండోరా వేయించిన పంచాయితీ అధికారులు
అనంతపురం జిల్లా విడపనకల్ మండల పరిధిలోని గడేకల్లు గ్రామంలో సోమవారం వైద్యాధికారుల బృందం వస్తున్నట్టు పంచాయితీ అధికారులు ఆదివారం సాయంత్రం గ్రామంలో దండోరా వేయించారు. ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి, పెద్ద కొట్టాలపల్లి పిహెచ్సి వైద్యాధికారి జయ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో వైద్యాధికారులు 104 సిబ్బందితో కలసి ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో చికిత్సలు అందిస్తారన్నారు. జ్వర పీడితులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరుగుతుందని గ్రామంలో దండోరా వేయించారు.