కడప జిల్లా కమలాపురం మండలం అప్పరావుపల్లె గ్రామంలో గత నెల 30న జరిగిన హత్య కేసులో మృతుని అన్నను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం తెలిసిన వివరాల మేరకు ఈ సందర్భంగా సిఐ రోషన్ వివరాలు తెలిపారు.గత నెల 30వ తేదీన తమ్ముడు మూల విశ్వనాథరెడ్డిని అన్న చెన్నారెడ్డి మాంసం కొట్టే మొద్దుతో కొట్టి హత్య చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు చెన్నారెడ్డిని సి.గోపాలపురం క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు.