కావలి: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలోనే పెద్ద రాముడు పాలెం గ్రామానికి చెందిన కాటంగారి బ్రహ్మయ్య (34) జువ్వలదిన్నె హార్బర్లో గ్రామస్థులతో కలిసి బోటులో ఆదివారం చేపలు వేటకు వెళ్లాడు. తుమ్మలపెంట సమీపంలో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు బోటు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడి భార్య గాయత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగింది.