అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని నారాయణపురం లో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాష్ట్ర వీర శైలుల చైర్మన్ స్వప్న మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరశైలుల చైర్మన్ స్వప్న మాట్లాడుతూ అనంతపురం రూరల్ లోని నారాయణపురంలో తమకు చెందిన భూమిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు గంగారం కొంతమందిని ఏర్పాటు చేసుకొని తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించిన ప్రయత్నం చేయడం జరిగిందని 100 సంవత్సరాలుగా తమకు చెందిన భూమిని ఎమ్మెల్యే అనుచరులే ఆక్రమించడం అన్యాయమని వీరశైలుల రాష్ట్ర చైర్మన్ స్వప్న తన ఆవేదన మీడియాకు వెల్లడించడం జరిగింది.