ఒంగోలు అర్బన్: పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | Apr 27, 2026
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో పెట్రోల్ మరియు డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద క్యూ లైన్లలో ప్రజలు నిలబడుతున్నారనే నేపథ్యంలో చీమకుర్తి పట్టణంలోని జియో, హిందుస్థాన్, ఒంగోలులోని మంగమూరు రోడ్ లోని నయారా, భారత పెట్రోలియం తదితర పెట్రోల్ బంక్‌లను జిల్లా ఎస్పీ గారు తనిఖీ చేశారు. పెట్రోల్, డిజిల్ తమ వాహనంలో నింపుకునేందుకు వచ్చిన వారితో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి పెట్రోల్, డిజిల్ కొరత లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.