ఉరవకొండ: దోమల నివారణ కోసం గ్రామాలకు మలాథియాన్ క్రిమిసంహారక మందులు సరఫరా చేసిన అధికారులు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని కోనాపురం షేక్షానుపల్లి పల్లి, తండా, రాకెట్ల, తండా గ్రామాల్లో దోమల నివారణ కోసం ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా మలేరియా వర్కర్ల చేత మలాథియాన్ క్రిమిసంహారకముందును శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా గ్రామాలకు ఆటోల ద్వారా పంపిణీ చేయడం జరిగిందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్య క్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రతి గ్రామంలోని ఫాగింగ్ కార్యక్రమాలను గ్రామపంచాయతీ అధికారులు చేపట్టాలని ఆదేశించారు.