పామూరు మండలంలోని మోపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జైకా నిదులు రూ .33 కోట్లతో చేపడుతున్న రిజర్వాయర్ ఆధునీకీకరణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా రిజర్వాయర్ పటిష్టత కు చర్యలు చేపట్టాలని , లీకేజీలు ఏర్పడకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.