నంద్యాల అర్బన్: బండి ఆత్మకూరులో ఓ యువకుడు పురుగుల మందు తాగి కోలుకోలేక చికిత్స పొందుతూ మృతి
Nandyal Urban, Nandyal | Apr 4, 2026
బండి ఆత్మకూరు గ్రామం కుమ్మరికుంట కాలనీకి చెందిన మారాసు బాలయ్య (33) పురుగు మందు తాగి కోలుకోలేక కర్నూలు ఆస్పత్రిలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలయ్య ఈనెల 2న పురుగు మందు తాగడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోలుకోలేక శనివారం మృతి చెందారు.