బనగానపల్లె: అధ్వానంగా ఎస్సార్బీసీ కాలువలు.
బనగానపల్లి నియోజకవర్గంలో ప్రధానవనరు ఎస్సార్బీసీ ద్వారా ఇక్కడ సుమారు 70వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రధానకాల్వ నుంచి బ్లాకుల ద్వారా బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాల రైతులకు నీరుఅందుతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం సుమారు లక్షఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా కాల్వల్ని నిర్మించగా..దీని పరిధిలోని పంట కాలువలన్నీ అధ్వానంగా మారడం, ఏళ్లపాటు కనీస మరమ్మతులు కరవవ్వడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు త్వరగా మరమ్మత్తులు చేపట్టాలని రైతులు శనివారం కోరారు.