రాప్తాడు: శారద నగర్ ఆర్డిటి వద్ద శివకోటి శ్రీ పీఠం ఆలయం నందు కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ శివకోటి ఆలయం నందు సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు కార్తీకమాసం సందర్భంగా శివకోటి శ్రీ పీఠంలో శ్రీ లలిత శివ కామేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు అరవింద్ మాట్లాడుతూ కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ శివ కామేశ్వరి దేవి అమ్మవారికి అభిషేకం అర్చనలు విశేష పూజలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా మహిళా భక్తులు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలను కూడా వెలిగించడం జరిగిందని ఆలయ నిర్వాహకుడు అరవింద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.