నంద్యాల అర్బన్: గోస్పాడు మండలం లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించిన ఆళ్లగడ్డ కోర్ట్
Nandyal Urban, Nandyal | Apr 7, 2026
నంద్యాల జిల్లా గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను వేధించిన పిన్నాపురం మనోహర్కు 3 రోజుల జైలు శిక్ష పడింది. దీబగుంట్లలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన అతడిపై పోలీసులు 296 BNS కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రవికుమార్ ముందు హాజరు పరచగా నిందితుడికి శిక్ష విధించారు.