అమరావతి రాజధాని తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం: బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
అమరావతి రాజధాని తీర్మానంపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం బనగానపల్లెలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో దోపిడీ కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని విమర్శించారు రాజధాని తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందని తెలుపారు అమరావతి కి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసిన తర్వాతనే మిగతా విషయాలు చర్చించాలని తెలిపారు