కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన ఏపీటీఎఫ్ నాయకులు
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. 12వ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను తక్షణం ప్రభుత్వం చెల్లించాలని, బోధనేతర పనులకు ఉపాధ్యాయులకు విధులు కేటాయించవద్దని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు.