డోన్: బేతంచర్ల మండలంలో గడ్డివాముకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు
Dhone, Nandyal | May 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన దగడ బాల గుర్రెడ్డి గడ్డివాముకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాక సుమారు రూ.50 వేల విలువ చేసే గడ్డివాము అగ్నికి ఆహుతి అయింది. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ట్రాక్టర్ ఇంజిన్ కూడా కాలిపోయింది