విశాఖపట్నం: విశాఖ : సముద్రపు నాచుతో సిరులు : సీజన్‌తో పని లేదు.. ఒక్కసారికి రూ.42 వేలు ఆదాయం
మన దేశం వ్యవసాయాధారిత దేశం.. ఎక్కువ మంది సేద్యంపైనే ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. అయితే ఒకప్పుడు సంప్రదాయ సాగు విధానాలతో రైతులు సిరులు కురిపించారు. అయితే ఇప్పుడంతా టెక్నాలజీ మయం. సేద్యంలోకి కూడా సాంకేతికత ప్రవేశించింది. పండించే పంటలు కూడా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మత్స్యశాఖ తీసుకున్న నిర్ణయం మత్స్యకార మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. మత్స్యకార మహిళకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ మత్స్యశాఖ సముద్రపు నాచు పెంపకం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత 30 మంది మహిళలకు ఇందులో ట్రైనింగ్ ఇచ్చారు.