బనగానపల్లె: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో రైతుల సమావేశం వాయిదా: నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రంగనాయకుడు
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో రైతుల సమావేశం వాయిదా పడినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు ఆదివారం వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ రైతులతో మంత్రి శనివారం సమావేశం కావాల్సి ఉండగా.. మంత్రి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో వాయిదా వేసినట్లు వెల్లడించారు. త్వరలోనే మంత్రి రైతులతో చర్చిస్తామని తెలిపారు.