కనిగిరి పట్టణంలోని పామూరు రోడ్డులో గురువారం ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ కఫార్ మాట్లాడుతూ... ఆహార భద్రత, పోషకాహారం మరియు సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. జింక్ ఫుడ్స్ జోలికి వెళ్లకుండా, ఆకుకూరలు, మాంసపు కృత్తులు కలిగిన ఆహారం, పాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ రమేష్ బాబు పాల్గొన్నారు.