నంద్యాల అర్బన్: బనగానపల్లెలో సీఎం సభ విజయవంతం, పోలీసులను అభినందించిన ఎస్పీ
Nandyal Urban, Nandyal | Jul 10, 2026
బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం పర్యటనలో అప్రమత్తంగా విధులు నిర్వహించిన ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బందిని ఎస్పీ సునీల్ పొరాణ్ అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడంతో బందోబస్తు ఏర్పాట్లు సజావుగా జరిగాయని తెలిపారు.