ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ ధీరజ్
అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో బుధవారం జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు.మొత్తం 800 మంది పైగా పోలీసు సిబ్బందిని ఈ కార్యక్రమానికి నియమించినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు చిన్నమండెం మండలానికి చేరుకొని, సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్ళనున్నట్లు ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.అధికారులు, భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచా