డోన్: దుమ్ముతో నిండిన బిల్లా స్వర్గం గుహలకు వెళ్లి రహదారి
Dhone, Nandyal | Apr 5, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన పర్యాటకంగా ప్రసిద్ధికెక్కిన బిల్ల స్వర్గం గుహలు ఉన్నాయి. బేతంచెర్ల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రెండేళ్ల క్రితం రహదారి నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు మధ్యలో నిలిపివేశారు. ప్రస్తుతం రహదారి వెంట వెళ్లాలంటే దుమ్ములేస్తోంది. కళ్ల ముందే వెళ్తున్న లారీ కనిపించకుండా దుమ్ములేస్తుందని ఇప్పటికైనా అధికారులు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు