జహీరాబాద్: బూచి నెల్లిలో కుక్కల స్వైర విహారం, ఇద్దరిపై తీవ్ర దాడి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచినెల్లిలో కుక్కలు స్వైర విహారం చేశాయి. శుక్రవారం రాత్రి గ్రామంలో పిచ్చికుక్కలు వీధుల వెంట తిరుగుతూ గ్రామానికి చెందిన అంజప్ప, బాబులను మెడ, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయపరిచాయి. పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను పట్టి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.