పలమనేరు: రోప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా ఎంపీ మరియు ఎమ్మెల్యే
పలమనేరు: మండలం కొలమాసనపల్లి పంచాయతీ దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ నందు రోప్స్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డితో పాటు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు వారికి ఘన స్వాగతం తెలియజేశారు. అనంతరం కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్లను వారు ప్రారంభించారు. అదేవిధంగా పలువురు విద్యార్థినీలకు సైకిల్స్ పంపిణి మరియు 50 పేద కుటుంబాలకు రేషన్ అంధచేసారు.