కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడి పట్ల అమలాపురంలో నిరసన తెలిపిన సీపీఎం పార్టీ నేతలు
కనీస మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభకరణ్ సింగ్ మరణించడం పట్ల అమలాపురంలో సీపీఎం పార్టీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సీపీఎం ఆద్వవర్యంలో ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు సమస్యలను పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం దీక్ష చేస్తున్న రైతును చంపడం దుర్మార్గమని దీనిని ప్రజలందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఖండించాలని రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నారు.