నిజామాబాద్ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్యసాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జక్రాన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీఓ, ఎంపీఓ, హౌసింగ్ ఏ.ఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి అని ఆరా తీశారు.