డోన్: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 7, 2026 రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం డోన్ మార్కెట్ యార్డులో రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ సండ్ర పల్లె నాగేశ్వర్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.