కోడుమూరు: ముడుమలగుర్తిలో కోటి సంతకాల సేకరణ, పాల్గొన్న వైసీపీ ఇన్చార్జి ఆదిమూలపు సతీష్
కోడుమూరు మండలంలోని ముడుములగుర్తి గ్రామంలో గురువారం వైసీపీ నాయకులు రచ్చబండ నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. సంతకాల సేకరణ చురుగ్గా సాగుతోందని తెలిపారు.