పిడుగురాళ్లలో వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ మృతి చెందింది అంటూ హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని విజయ నర్సింగ్ హోమ్ వద్ద ఆదివారం బాధితులు ఆందోళన చేపట్టారు.డాక్టర్ నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయిందని బంధువుల ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో హాస్పటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.మృతురాలి బంధువులు హాస్పిటల్ వద్దకు భారీగా చేరుకోవటంతో డాక్టర్ మరియు వైద్య సిబ్బంది అక్కడి నుండి వెల్లపోయారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.