అనంతపురం అర్బన్: రామగిరి కొత్తపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 9, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం రామగిరి కొత్తపల్లి వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో రామగిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ మరియు నితీష్ అనే ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.