గుంతకల్లు: గుత్తి పట్టణంలోని పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న మూత పడిన హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పోలీసు స్టేషన్ పక్కనే మూత పడిన బాలుర హాస్టల్ లో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని కర్నూలు రోడ్డులో పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న వసతి గృహంలో గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్కడే ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రోజు మాదిరిగా నిద్ర లేవకపోవడంతో అనుమానం తో స్థానికులు పరిశీలించగా మృతి చెందినట్టు తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.