ఆళ్లగడ్డ: కోటకొండ గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ కుమ్మరి పెద్ద మద్దయ్య మృతి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ కుమ్మరి పెద్ద మద్దయ్య మృతి చెందారు, పంట పొలంలో పనిచేస్తుండగా ఎండ తీవ్రతకు గురై అస్వస్థతకు లోనయ్యారు, ఇంటికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు, ఉపాధి పనులు గంటలు తరబడి ఎండలో చేస్తుండడంతో వడదెబ్బ బలిన పడుతున్నామని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మృతి చెందిన ఉపాధి కూలీ కుమ్మరి పెద్ద మద్దయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు