ధర్మవరం మండలం గొట్లూరులో జీఎస్టీ తగ్గింపుపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల అవగాహనా ర్యాలీ.
ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో ఆదివారం జీఎస్టీ తగ్గింపు పై ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి కొన్ని రకాల వస్తువులపై వెసులుబాటు కల్పించిందని ప్రజలు దుకాణాల వద్ద జిఎస్టి తగ్గింపు గురించి అడిగి లబ్ధి పొందాలని సూచించారు.