జలదిగ్బంధంలో తిరుపతిగుంట సంఘం
జలదిగ్బంధంలో తిరుపతిగుంట సంఘం ఉలవపాడు(M) మన్నేటికోట పంచాయతీలోని తిరుపతిగుంట సంఘం STకాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతంగా ఉన్న కాలనీ వరద ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్, తహశీల్దార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారని కాలనీవాసులు చెప్పారు. కాని సహాయక చర్యలు మాత్రం ఏవీ చేపట్టలేదన్నారు.