ఒంగోలు అర్బన్: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సంయుక్త కిషన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు నిరసన బాటపట్టారు. క్వింటా వర్జీనియా పొగాకుకు రూ.20వేల కనీస మద్దతు ధర కల్పిస్తామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. నేటి (జూన్ 24) నుంచి 27వ తేదీ వరకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద పొగాకు రైతులు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీని అమలుచేయాలని వారు కోరుతున్నారు.