జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటు ఎమ్మెల్యే పాల్గొని పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 26 చిరస్మరణీయమైన రోజని గుర్తు చేశారు. పార్టీ అధినేత కేసిఆర్ చావు నోట్లో తలపెట్టి నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సాధించారన్నారు.