కందుకూరులో రవాణాశాఖ స్పెషల్ డ్రైవ్...
కందుకూరు ఆర్టీవో టి.వి.యన్ లక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక RTC బస్టాండ్ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనచోదకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ ధ్రువపత్రాలు పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన 7 బైకులు, ఒక ఆటోపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీవో సూచించారు. హెల్మెట్ ధరించిన బాధ్యతగల వాహనదారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.