బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్లో ప్రమాదవశాత్తు పడి ఒంగోలుకు చెందిన హేమంత్ (17) అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనపై ఎస్ఐ జగన్మోహన్ స్పందిస్తూ.. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాలువలో నీటి ప్రవాహం అత్యధికంగా ఉండటంతో గాలింపునకు ఆటంకం కలుగుతోందని, ఇంకా యువకుడి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు