దుండిగళ్ల ప్రాంతంలోని డంపింగ్ యార్డుల్లో చెత్తను అక్రమంగా కాల్చివేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ వంటి విషపూరిత వాయువులు గాలిలోకి విడుదలవుతున్నాయని, దీంతో పరిసర ప్రాంతాల్లో గాలి తీవ్రంగా కలుషితమవుతోందని వాపోతున్నారు. ఈ కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి మంటలు, తలనొప్పి వంటి అనారోగ్యాలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. చెత్తను కాల్చడం