ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టడంలోని అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం అమృత లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉపముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆళ్లగడ్డ నియోజకవర్గం జనసేన ఇన్చార్జి మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఆలయానికి చేరుకొని కుంకుమార్చన లు, అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు, ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అమృత లింగేశ్వర స్వామి శివాలయంలో స్వామివారిని ప్రార్థించినట్లు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మైలేరి మల్లయ్య తెలిపారు