డోన్: బేతంచెర్ల లో బంగారు గొలుసు దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్
Dhone, Nandyal | Apr 17, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలో జరిగిన బంగారు గొలుసు దొంగతనం కేసులో గౌరిపేటకు చెందిన చింతకాయల సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 31న పాతబస్టాండ్ సమీపంలోని మద్దెల పరిమళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు చైన్ను దొంగలించినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ముచ్చట్ల క్షేత్రం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు