బనగానపల్లె: కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి: బనగానపల్లె జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి
భారతీయ సంప్రదాయంలో కలంకారి రంగానికి విశిష్టత ఉందని, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి కోరారు. శుక్రవారం బనగానపల్లె టంగుటూరు గ్రామంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత శివప్రసాద్ రెడ్డిని ఆయన ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం కలంకారి రంగానికి ప్రత్యేక కోర్సులు, పాఠశాలలు ప్రవేశపెట్టి ఈ రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.